ఇలాంటి క్యాచ్ చూసి ఉండ‌రు. నెటింట్లో వైర‌ల్ అవుతున్న వీడియో..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2020 3:18 PM GMT
ఇలాంటి క్యాచ్ చూసి ఉండ‌రు. నెటింట్లో వైర‌ల్ అవుతున్న వీడియో..

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి అరిక‌ట్ట‌డానికి ఇప్ప‌టికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. క‌రోనా ముప్పుతో చాలా టోర్నీలు ర‌ద్దు కాగా.. ప‌లు టోర్నీలు వాయిదా ప‌డ్డాయి. దీంతో క్రీడాకారులంతా స్వీయ నిర్భందం (సెల్ప్ ఐసోలేష‌న్‌)లోకి వెళ్లారు. న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. కాగా.. ఈ ఖాళీ సమయంలో తన పెంపుడు కుక్క(సాండీ)తో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో సాండీతో కలిసి క్రికెట్‌ ఆడిన వీడియోను విలియమ్సన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

విలియమ్సన్‌ తన ఇంటి ఆవరణలో సాండీతో పాటు మరొకరితో క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ చేస్తున్న విలియమ్సన్‌ స్లిప్‌లో ఉన్న సాండీ వైపు ఆడాడు. అయితే స్లిప్‌లో సిద్దంగా ఉన్న సాండీ విలియమ్సన్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తూ కళ్లు చెదిరే రీతిలో నోటితో క్యాచ్‌ అందుకుంది ఆ వీడియోలో.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన విలియ‌మ్ సన్‌.. ‘సాండీ స్లిప్‌లో ఉంది. ఇంకా ఎక్కడైన కుక్కలు ఉండే సాండీతో క్రికెట్‌ ఆడొచ్చు’అంటూ కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సాండీ ప్ర‌తిభ‌ను నెటీజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

Next Story
Share it