సందీప్ కిష‌న్‌కు ఈసారైనా విజ‌యం వ‌రించేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 7:54 AM GMT
సందీప్ కిష‌న్‌కు ఈసారైనా విజ‌యం వ‌రించేనా..?

యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం 'A1 ఎక్స్‌ప్రెస్' ప‌లువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో సినిమా చిత్రీకరణ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. అలాగే ఈ జోన‌ర్‌లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.

న‌వంబ‌ర్ 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేయనున్నారు.

Next Story