ఇక వికీపీడియాలో తెలంగాణ రాష్ట్రం.. పెద్దపీట వేసేందుకు సర్కార్‌ కసరత్తు

By సుభాష్  Published on  29 Dec 2019 5:31 AM GMT
ఇక వికీపీడియాలో తెలంగాణ రాష్ట్రం.. పెద్దపీట వేసేందుకు సర్కార్‌ కసరత్తు

తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ మరో ముందుడుగువేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం మరోఘన కార్యానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు ట్రిపుల్‌ఐటీ తోడైంది. భారతీయ భాషల డిజిటలీకరణ ప్రాజెక్టును రూపొందించనున్న ఐటీ ప్రొఫెసర్‌ వాసుదేవ వర్మ నేతృత్వంలో తెలంగాణ సర్కారు ప్రయత్నానికి సహకారం అందుతోంది.

వికీపీడియానే ఎందుకు..?

నెటిజన్లు సాధారణంగా సెర్చింజన్లలో ఏదైన విషయం కోసం వెతకాలంటే వికీపీడియాలోనే. గూగుల్‌ లాంటి సంస్థలు కూడా వికీపీడియాకు సెర్చ్‌ ఇండెక్‌స్‌లోప్రాధాన్యతనిచ్చాయి. ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సర్వర్లను నిర్వహించి, కొత్త వెబ్‌సైట్‌ను ప్రారభించినా సెర్చ్‌ ఇండెక్‌స్‌లో ఆ వివరాలు ముందంజలోఉంటం దాదాపు సాధ్యమేనని చెప్పాలి. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన నిపుణులు, మేధావులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో వికీపీడియాలోనే సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడం ఉత్తమమని భావించిన తెలంగాణ సర్కార్‌ ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

తెలంగాణ కీర్తి పతాక వికీపీడియాలో విస్తరించనుంది

ఇక తెలంగాణ కీర్తి పతాక వికీపీడియాలో విస్తరించనుంది. మారుమూల కుగ్రామంలోని గల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు, ప్రతి ప్రాంత వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి తెలంగాణచరిత్ర వరకు, రాష్ట్ర సంస్కృతిక, సంప్రదాయాలు, కళలు మొదలైన పర్ఆయటకం దాక సమగ్ర సమాచారాన్ని వికీపీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అందించేందుకు ఓ మహాయజ్ఞానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆవిర్భావంతో పాటు ఐటీ శాఖలో పురుగు పోసుకున్న డిజిటల్‌ మీడియా వింగ్‌ ఆ బాధ్యతలను చేపట్టింది. కాగా, వికీపీడీయా వేదికను తెలంగాణను వినిపించేందుకు ఇప్పటికే ఒప్పందాలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనేది ఐటీ శాఖ ఆలోచన.

ఇంగ్లిష్‌ మాదిరిగానే తెలుగులో..

ఇంగ్లిష్‌ వికీపీడియాలో ప్రతి చిన్న అంశంపై వివరాలు అందుబాటులో ఉన్నాయి. పలు పేజీల లింకులు, లక్షల కొద్ది వ్యాసాలు ఇంగ్లిష్‌ వికీపీడీయాలో లభ్యమవుతాయి. అలాగే తెలుగులో కూడా కీలక సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రభుత్వ లక్ష్యం. మొదటి దశలో పలు అంశాలపై దృష్టి సారిస్తోంది. రాజకీయం, తెలంగాణలో ఎన్నికలు, తెలంగాణ పర్యాటక, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సాహిత్యం, ప్రభుత్వ సమాచారం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అలాగే విదేశాలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకువస్తారు.

అక్షరాలు రాకున్నా సరే..తెలుగులో టైపింగ్‌..

అక్షరం రాకున్నా తెలుగులో టైపింగ్‌ అవగాహన లేకున్నా సమాచారాన్ని పోస్టు చేసే అవకాశాలపై డిజిటల్‌ మీడియా వింగ్‌ తెగ కసరత్తు చేస్తోంది. ఆసక్తి ఉన్న రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, విశ్రాంత పండితులు చేతరాతలతో వ్యాసాలు పంపితే దాన్ని ఆపరేటర్లతో టైప్‌ చేయిస్తారు. ఇక స్మార్ట్‌ ఫోన్‌లో తెలుగులో మాట్లాడితే గూగుల్‌ దానంతట అదే టైప్‌ చేస్తుంది. దానిని అప్‌లోడ్‌ చేస్తే చేసేవిధంగా అన్నిరకాల టూల్స్ ను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story