అనంతపురం: కాళ్ల పారాణి కూడా ఆరక ముందే నూరేళ్ల బంధానికి ఏడు రోజుల్లోనే స్వస్తి పలికింది ఓ భార్య. పెళ్లి జరిగి వారం రోజులు కూడా గడవకముందే ఎన్నో ఆశలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టిన ఆ భర్తకు ఆదిలోనే పెనుగండాన్ని ఎదుర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా మదనంతపురంలో అత్తవారింటికి వచ్చిన భర్త లింగమయ్యకు భార్య పాలల్లో కలిపి విషం ఇచ్చింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న లింగమయ్యను మొదట సోదరుడు గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లింగమయ్యను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు లింగమయ్య స్వస్థలం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి. ఈ నేపథ్యంలో కేసును గుత్తి పోలీసులు జొన్నగిరి పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.