భార్య సెల్‌ఫోన్‌తో కాపురం చేస్తోందని భర్త ఏం చేశాడంటే..!

By సుభాష్  Published on  6 Feb 2020 9:27 PM IST
భార్య సెల్‌ఫోన్‌తో కాపురం చేస్తోందని భర్త ఏం చేశాడంటే..!

సెల్ ఫోన్ .. ఇది మానవ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఘటనలున్నాయి. సెల్‌ఫోన్‌ వల్ల పలు అనుమానాలకు దారి తీస్తోంది. సెల్‌ ఫోన్‌ కారణంగా భార్యాభర్తల మధ్య చిచ్చుమొదలై ప్రాణాల మీదకు తెచ్చింది. కొత్తగా పెళ్లై భర్త ఇంటికి వచ్చిన భార్య ఎప్పుడు సెల్‌ఫోన్‌ చూస్తోందని, నాతో గడపడం లేదంటూ భర్త దారుణంగా హత్యమార్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ పరిధిలోని రామ్‌గఢ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వివాహమైన రెండు నెలలకే..

వివాహమైన రెండు నెలలకే భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ప్రతి రోజు సెల్‌ఫోన్‌తో గడుపుతోందని, నన్ను పట్టించుకోవడంలేదని, ఎవరితోనో మాట్లాడుతూ, చాటింగ్‌ చేస్తోందని భర్త భార్యను గొంతుకోసి హత్య చేశాడు. రామ్‌గఢ్‌ ప్రాంతానికి చెందని ఆసిఫ్‌కి కాశ్మీర్‌ గేటు ప్రాంతానికి చెందిన అష్మాతో గత ఏడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. వివాహమై అత్తారింటికి వచ్చిన అష్మా .. నిత్యం సెల్‌ ఫోన్‌తోనే గడుపుతోందని, నన్ను పట్టించుకోవడం లేదని భర్త ఆగ్రహానికి గురైన ఈ దారుణానికి పాల్పడ్డాడు

అర్ధరాత్రి భార్య గొంతు కోసి..

అనుమానం పెంచుకున్న భర్త.. అష్మాను గొంతుకోసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆసిఫ్‌ తల్లి రబియా బేగం అడ్డువచ్చింది. కోపంతో వినకుండా భార్యను దారుణంగా హత్య చేసి తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సెల్‌ఫోన్‌లో రోజూ మాట్లాడుతోందని, ఎవరితోనే చాటింగ్‌ చేస్తోందని భార్యను హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. వెంటనే పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అందుకే నా కూతుర్ని చంపేశాడు..

కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తెలుసుకున్న అష్మా తల్లిదండ్రులు, ఆసిఫ్‌ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహం సమయంలో బైక్‌, రెండు లక్షల కట్నం ఇవ్వలేదనే కోపంతో తన కుమార్తెను దారుణంగా హతమార్చాడని వారు ఆరోపించారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అష్మా అత్తింటి వాదన ఎలా ఉందంటే..

కాగా, అష్మా అత్తింటి వారి వాదన మరోలా ఉంది. అష్మా వివాహమైనప్పటి నుంచి సెల్ ఫోన్‌తోనే ఎక్కువ గడుపుతోందని, ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఆసిఫ్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎప్పుడూ సెల్‌ఫోన్‌తోనే ఉంటుందని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సెల్‌ఫోన్‌తోనే కాపురం చేస్తోందని, అందుకే చంపేసినట్లు భర్త పోలీసుల ముందు చెప్పాడు.

Next Story