ఘోరం.. రెండవ భర్త గోర్లు పీకి.. ఆ తర్వాత కూడా..

By అంజి  Published on  29 Jan 2020 9:11 AM GMT
ఘోరం.. రెండవ భర్త గోర్లు పీకి.. ఆ తర్వాత కూడా..

కర్నాటక: పచ్చ నోట్లు.. పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కుటుంబ బంధాలను సైతం తెంచేస్తున్నాయి. ఉన్నపలంగా సామాజిక బంధాలను ప్రభావితం చేస్తున్నాయి. డబ్బుల విషయంలో భార్యతో గొడవ పడి ఓ భర్త ప్రాణాలు పొగొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుబ్రమణ్యం, రశ్మిలు ఇద్దరు భార్య భర్తలు. ఇద్దరూ కూడా బెంగళూరులో ఉన్నత ఉద్యోగులు. భర్త ప్రైవేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కాగా.. భార్య బెంగళూరు ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తోంది. భార్య రశ్మికి అంతకుముందే 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. మొదటి భర్తతో గొడవ పడి విడాకులు తీసుకున్న రశ్మి.. ఆ తర్వాత సుబ్రమణ్యంకు పరిచయం అయింది. ఇద్దరు నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

సంవత్సరం పాటు బాగానే ఉన్న ఈ భార్య,భర్తల మధ్య గొడవ చెలరేగింది. దాంతో రశ్మి తన మొదటి భర్త దగ్గర ఆరు నెలల గడిపి.. తిరిగి రెండు భర్త దగ్గరకు వచ్చింది. సుబ్రమణ్యం నుంచి రశ్మి లక్ష రూపాయలు తీసుకుంది. తన నుంచి తీసుకున్న లక్ష రుపాయలు ఇవ్వాలంటూ భర్త సుబ్రమణ్యం భార్యను అడిగాడు. ఇదే ఆమె ఆగ్రహానికి కారణమైంది. అయితే తన నుంచి తీసుకున్న రూ.5లక్షల డబ్బులు ఇవ్వాలని సుబ్రమణ్యాన్ని భార్య డిమాండ్‌ చేసింది. దీంతో భర్తపై పగ పెంచుకున్న భార్య రష్మి అతడిని కిడ్నాప్‌ చేయడానికి ప్లాన్‌ వేసింది. రశ్మి తన సోదరుడు, అతని ఇద్దరు స్నేహితులు కలసి భర్త సుబ్రమణ్యంను కిడ్నాప్‌ చేసి హింసించారు. ఈ ఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్లెగాల సమీపంలో ఉన్న ముడిగుండం గ్రామంలో జరిగింది.

భర్తను కిడ్నాప్‌ చేసిన భార్య.. అతడిని ఐదురోజుల పాటు ముడిగుండంలో బంధించింది. సుబ్రమణ్యాన్ని దారుణంగా చేతి గోళ్లను పీకేసీ, ఇనుక కడ్డీలో కొట్టి హింసించారు. ఆ తర్వాత సుబ్రమణ్యన్నిఅతని ఇంటి వద్ద పడేసి పరారీ అయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు భర్త సుబ్రమణ్యాన్ని గుర్తించి చికిత్స నిమిత్తం మైసూరు ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడు మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో సబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు రశ్మిని కొళ్లెగాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగత నిందితులు రాకేష్‌, ప్రదీప్‌, రాకేష్‌ పరారీలో ఉన్నారు.

Next Story
Share it