సంసారంలో చిచ్చుపెట్టిన 'టిక్ టాక్' పరిచయం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2019 2:00 PM IST
హైదరాబాద్: భర్త తనను మోసం చేశాడంటూ ఓ వివాహిత ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. సత్యరాజు, అనురాధ దంపతులు వీటీపీఎస్ కాలనీలో నివాసం ఉంటారు. 2009లో వీరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలు తరువాత పిల్లలు పుట్టలేదని వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాదు...మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ మధ్య టిక్ టాక్‌లో పరిచయమైన వనిత అనే మహిళను వివాహం చేసుకున్నట్లు అనురాధ తెలుసుకుంది. దీంతో భర్త సత్యరాజుపై అనురాధ ఫిర్యాదు చేసింది.
టిక్ టాక్‌లు వినోదాన్ని పంచడమే కాదు..సంసారంలో చిచ్చు కూడా పెడుతున్నాయి. సత్యరాజ్ - అనురాధల కాపురం కూడా టిక్ టాక్ వలనే మంటగలిసింది. సాఫీగా సాగుతున్న వారి కుటుంబంలో కలహాలకు దారి తీసింది. టిక్ టాక్‌లో వనిత యువతి పరిచయం అయ్యేనాటికి..కాపురంలో చిన్నచిన్న కలహాలు ఉన్న సర్దుకుపోయే వారు. కాని..టిక్ టాక్‌లో వనిత అనే యువతి పరిచయం కావడంతో కలహాలు ముదరడం ప్రారంభమైంది. తరువాత కొంత కాలానికి భార్య అనురాధను వదిలేసి..టిక్ టాక్‌లో పరిచయమైన వనితను సత్యరాజ్ వివాహ మాడాడు. ఈ మేరకు అనురాధ ఇబ్రహీం పట్నం పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేసింది . తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.