కీసర పోలీస్‌ స్టేషన్ ప‌రిధిలోని రాంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళ‌లేక‌ ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాళ్లోకెళితే.. త్రినయని, అక్షయ్‌ దంపతులు రాంపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ జంట ఏడు నెలల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ విహహం చేసుకున్నారు.

గత కొన్ని రోజులుగా త్రినయని భర్త అక్షయ్‌ వేధింపులకు గురిచేస్తుండ‌టంతో.. భర్త వేధింపులు తాళలేక త్రినయని సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అక్షయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story