ప్లాస్మాదానం చేయలేకపోయిన రాజమౌళి.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2020 3:12 PM IST
ప్లాస్మాదానం చేయలేకపోయిన రాజమౌళి.. ఎందుకంటే..?

దర్శకదీరుడు రాజమౌళి ఫ్యామిలీ కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. రెండు వారాల తర్వాత జక్కన ఫ్యామిలీ కరోనాను జయించింది. కాగా.. కరోనా పాజిటివ్‌ వచ్చిన సమయంలో తాము కరోనాను జయిస్తామని, తమ కుటుంబ సభ్యులం అందరూ ప్లాస్మాను దానం చేసి కరోనా వారియర్స్‌గా నిలుస్తామని దర్శకుడు రాజమళి చెప్పాడు. చెప్పినట్లుగానే రాజమౌళి, కీర‌వాణి అండ్ ఫ్యామిలీ క‌రోనా వైర‌స్ నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. ఇప్పుడు కీర‌వాణి, ఆయ‌న త‌న‌యుడు కాల‌భైర‌వ కిమ్స్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మాను డొనేట్ చేశారు. కానీ రాజ‌మౌళి ప్లాస్మాను డొనేట్ చేయ‌లేదు. అయితే ప్లాస్మాను తాను డొనేట్ చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని ట్విట్ట‌ర్‌లో రాజ‌మౌళి తెలిపారు.

'శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, నా ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి 8.62 మాత్రమే ఉంది. ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే అధికంగా ఉండాలి. పెద్దన్న, భైరవ మాత్రం ప్లాస్లా దానం చేశారు' అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి ఫొటోలను పోస్ట్ చేశారు.



Next Story