నేటి నుండి డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 May 2020 9:01 AM IST
నేటి నుండి డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశం

కరోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తున్న త‌రుణంలో మొద‌టిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వార్షిక‌ సమావేశాలు నేడు స్విట్జ‌ర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ప్రారంభంకానున్నాయి. అంత‌ర్జాతీయంగా కొన్ని కీల‌క విష‌యాల‌లో మొద‌టినుండి చైనాపై ఆరోపణ‌లు చేస్తున్న‌ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లాంటి అగ్ర‌ దేశాలు ఈ స‌మావేశాల‌ను ఓ అవకాశంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ప్రతి స్పందనను స్వతంత్రంగా సమీక్షిస్తామని యురోపియ‌న్ యూనియ‌న్‌ వెల్లడించింది.

ఇదిలావుంటే.. చైనా.. తనపై వచ్చిన ఆరోపణలకు డబ్ల్యూహెచ్‌వో స‌మావేశాలే వేదికగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ విష‌య‌మై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడుతూ.. తైవాన్‌కు ఆహ్వాన ప్రతిపాదనపై ‌ మండిపడ్డారు. అంతేకాదు.. చైనా ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిస్తామన్న హెచ్చ‌రించిన‌ ఆస్ట్రేలియాకు ఘాటుగా స‌మాధాన‌మిచ్చారు. ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నుంచి మాంసం దిగుమతులను తాత్కాలికంగా నిషేధించింది.

Next Story