'మ‌హా స‌ముద్రం' ఉందా..? లేదా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 11:26 AM IST
మ‌హా స‌ముద్రం ఉందా..? లేదా..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో అజ‌య్ భూప‌తితో సినిమా చేసేందుకు యువ హీరోలు నితిన్, రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇంట్ర‌స్ట్ చూపించారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ... అజ‌య్ కి ఈ హీరోలు నో చెప్పారు. ఆత‌ర్వాత‌ మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో అజ‌య్ సినిమా అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

దీనికి మ‌హా స‌ముద్రం అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్తుంది అన‌గా.. ర‌వితేజ కూడా అజ‌య్‌కి హ్యాండ్ ఇచ్చాడు. దీంతో అజ‌య్ ఈ సినిమాని నాగ చైత‌న్య‌తో చేయ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే... ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని అజ‌య్ ఆ వార్త‌ల‌ను ఖండించాడు. ఈ వార్త‌లు వ‌చ్చి చాలా రోజులు అయిన‌ప్ప‌టికీ.. అజ‌య్ మ‌హా స‌ముద్రం ఏమైందో అప్ డేట్ లేదు.

తాజా వార్త ఏంటంటే... మ‌హా స‌ముద్రం సినిమాని చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో అజ‌య్ ఈ క‌థ‌ను ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. ఇటీవ‌ల నాగ చైత‌న్య‌కి అజ‌య్ ఓ స్టోరీ లైన్ వినిపించాడ‌ట‌. ఈ లైన్ చైత‌న్య‌కి బాగా న‌చ్చింద‌ట‌. ప్ర‌స్తుతం అజ‌య్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. అజ‌య్ నెక్ట్స్ మూవీ నాగ చైత‌న్య‌తో ఉండే అవకాశం ఉంది.

Next Story