వాట్సాప్ సలహా పాటించిన ప్రయాణికులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 7:57 AM GMT
వాట్సాప్ సలహా పాటించిన ప్రయాణికులు

విజయవాడలో పెంచిన ప్లాట్‌పాం టికెట్ ధరపై వచ్చిన వాట్సప్ మెసేజ్ ను నిజం చేశారు ప్రయాణికులు. ప్లాట్‌పాం టికెట్ కంటే పాసింజర్ టిక్కెట్ కొనటం బెటర్ అంటూ వాట్సప్ వైరల్ అయిన మెసేజ్ ను సీరియస్ గా తీసుకున్నారు. దీంతో విజయవాడ రైల్వేస్టేషన్ లో ప్లాట్‌పాం టికెట్ కన్నా, గుంటూరు పాసింజర్ రైలు టికెట్లు పెద్ద మొత్తంలో అమ్ముడు పోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు సైతం అవాక్కయ్యారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ప్లాట్‌పాం టికెట్ ధరని పది రూపాయల నుంచి ఒక్కసారిగా 30 రూపాయలకు పెంచింది. పెరిగిన ధరలు తక్షణం అమలు అవుతాయని ప్రకటించింది. ఆ వెంటనే వాట్సాప్ లో ఒక మెసేజ్ చక్కర్లు కొట్టింది. ప్లాట్‌పాం టికెట్ కొని బదులు పాసింజర్ టికెట్ కంటే 20 రూపాయలు మిగులుతుందని.. అంతే కాదు రెండు గంటల తరువాత కూడా రైల్వేస్టేషన్ లో ఉండొచ్చని ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు వెళుతూ వెళుతూ ఆ టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని కూడా సలహా కూడా ఉంది.

అయితే.. తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్ ప్లాట్‌పాం టికెట్ బదులు గుంటూరు పాసింజర్ టికెట్ ఎక్కువగా అమ్ముడు పోవడం గుర్తించిన అధికారులు ఒక ప్రకటన చేశారు. ప్రయాణికుల భద్రత కోసమే ప్లాట్‌పాం టికెట్ ధర పెంచామని, దీని వల్ల రైల్వే శాఖకు వచ్చే ఆదాయం చాలా స్వల్పమని చెప్పారు. రైల్వే స్టేషన్ లో కొన్నిచోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్లాట్‌పాం టికెట్ లు మాత్రమే కొనండి.. గుంటూరు పాసింజర్ టికెట్లు కొనద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.

Next Story