ఫేక్ వార్తలను నియంత్రించే దిశగా వాట్సాప్ చర్యలు..

By రాణి  Published on  19 March 2020 6:13 PM IST
ఫేక్ వార్తలను నియంత్రించే దిశగా వాట్సాప్ చర్యలు..

సోషల్ మీడియా అంటే..అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది వాట్సాప్. ఆ తర్వాతే ఫేస్ బుక్, ట్విట్టర్ వగైరా..వగైరా. రెండు నెలల నుంచి కరోనా వైరస్ దేశాలు..ఖండాలు..ఎల్లలు దాటి విస్తరిస్తుండటంతో చాలా మంది ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ రకమైన ఫేక్ న్యూస్ లను కనిపెట్టి అవి వైరల్ అవకుండా ఉండేందుకు వాట్సాప్ యాజమాన్యం ప్రత్యేకంగా వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్ ను ఏర్పాటు చేసింది. దీనికోసం పోయెంటర్స్ ఇనిస్టిట్యూట్ కు చెందిన అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్ 1 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించింది.

Also Read : బ్రేకింగ్: భారత్‌లో నాలుగో కరోనా మరణం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో వాట్సాప్ ఈ వినూత్నమైన హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ హబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సిబ్బందికి, కమ్యూనిటీ లీడర్లకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థల కమ్యూనికేషన్ కు సహకరించడంతో పాటు పలురకాల సూచనలు కూడా ఇవ్వనుంది. అలాగే వాట్సాప్ లో తప్పుడు వార్తలు వైరల్ అవ్వకుండా నివారించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఐఎఫ్ సీఎన్ సహాయం కూడా తీసుకుంటోంది.

Also Read : టిటిడి సంచలన నిర్ణయం

ఈ సందర్భంగా వాట్సాప్ సంస్థ ఉన్నతాధికారి విల్ క్యాత్ కార్ట్ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు ప్రజలను కాటేస్తోన్న తరుణంలో వాట్సాప్ వాడకం బాగా పెరిగిందన్నారు. భారత్ లోనే 400 మిలియన్ల మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. స్నేహితులు, బంధువులకు కరోనాకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారానే చేరవేస్తున్నారట. అందుకే వీటిలో ఏవి ఫేక్, ఏవి రియల్ అన్నది కనిపెట్టేందుకు ఐఎఫ్ సీఎన్ సహాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు కరోనా గురించి తాజా సమాచారాన్ని అందించేందుకు అన్ని దేశాల ఆరోగ్య శాఖ మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Also Read : నిర్భయ దోషుల న్యాయవాది సరికొత్త ప్రతిపాదన

Next Story