నిర్భయ దోషుల న్యాయవాది సరికొత్త ప్రతిపాదన

By రాణి  Published on  19 March 2020 11:46 AM GMT
నిర్భయ దోషుల న్యాయవాది సరికొత్త ప్రతిపాదన

మరికొద్ది గంటల్లో నిర్భయ దోషులు నలుగు ఉరికంభం ఎక్కనున్నారు. వీరంతా కలిసి ఉరి పై స్టే ఇవ్వాలని కోరుతూ ఢిల్లి పటియాలా కోర్టులో వేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష యథాతథంగా మార్చి 5వ తేదీన జారీ చేసిన డెత్ వారెంట్ల ప్రకారమే అమలవుతుందని తేల్చేసింది. దీంతో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులను ఉరితీయనున్న నేపథ్యంలో దోషుల తరపు న్యాయవాది సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు.

Also Read : టిటిడి సంచలన నిర్ణయం

నిర్భయపై అత్యాచారం కేసులో దోషులైన నలుగురు దేశ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ నలుగురు దోషుల్ని భారత్, పాకిస్థాన్ సరిహద్దులకు లేదా..భారత్ చైనా సరిహద్దు అయిన డోక్లాంకు దేశ సేవ చేసేందుకు పంపించాల్సిందిగా సూచించారు. ఇలా చేస్తే వారి కుటుంబ సభ్యులకు కూడా కాస్త క్షోభ తగ్గుతుందని, వారిని ఉరితీయవద్దని ఏపీసింగ్ కోర్టును కోరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తానొక అఫిడవిట్ ను కూడా దాఖలు చేయనున్నట్లు ఏపీ సింగ్ తెలిపారు.

Also Read : నిర్భయ దోషులకు రేపే ఉరి ?

ఇప్పుడు ఏపీ సింగ్ ఈ అఫిడవిట్ వేస్తే..దీనిపై ఒక స్పష్టత వచ్చేంత వరకూ ఉరిశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. అందరూ ఊహించినట్లే మరోసారి నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. అఫిడవిట్ దాఖలు చేయగానే..కోర్టు దానిని కొట్టివేస్తే గనుక ఉరిశిక్ష యథాతదంగానే అమలవుతుంది.

Also Read : ‘కరోనా వైరస్‌’ ఎక్కువగా సోకేది.. ఆ రక్తం గ్రూపువాళ్లకేనట..!

Next Story