వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు వచ్చాయి.. ఏంటో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 6:27 AM GMT
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు వచ్చాయి.. ఏంటో తెలుసా..?

వాట్సాప్​.. స్మార్ట్​ఫోన్ వాడుతున్న వారిలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఈ యాప్​ను వాడుతున్నారు. కేవలం మన దేశంలోనే 40 కోట్ల మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నారు. ఈ యాప్​ ఇంత ఎక్కువ మందికి చేరువ కావడానికి ప్రధాన కారణం.. అందులో ఉండే ఫీచర్లు. యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్​ అదే తరహాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్​డేట్లు తెస్తుంది. తాజాగా భారీ ఎత్తున కొత్త ఫీచర్లు తెచ్చేందుకు సిద్ధమైంది ఫేస్​బుక్​కు చెందిన మెసెంజర్ దిగ్గజం​. ఈ సారి తీసుకొచ్చే ఫీచర్లపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ ఫీచర్లేంటి? వాటి ఉపయోగమెంత? అనే విషయాలు మీ కోసం.

డార్క్​ మోడ్​..

వాట్సాప్​ ఎప్పటి నుంచో ఊరిస్తున్న కొత్త ఫీచర్ ​డార్క్​ మోడ్​. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే వాట్సాప్​ ఇంటర్​ఫేస్​​ సహా అన్ని ఆప్షన్లు కేవలం లేత రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉండనుంది. దీని ద్వారా రాత్రి పూట వాట్సాప్​ వాడేందుకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫోన్​​ ఛార్జింగ్​ ఎక్కువసేపు వస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుంది.

whatsapp

బూమరాంగ్ ఫీచర్​..

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్​ బూమరాంగ్. ఏదైన ఫొటోను సరదాగా స్వల్ప నిడివిగల వీడియోగా మార్చడమే ఈ ఫీచర్​లో ఉన్న సౌకర్యం. ప్రస్తుతం ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఫీచర్​ తెగ హల్​చల్​ చేస్తోంది. అలాంటి ఫీచర్​ను తమ వినియోగదారులకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐఓఎస్​ యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్​ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే వీలుంది.

డిలీట్​ ఆటోమేటిక్​..

వాట్సాప్ యూజర్లు అవతలి వ్యక్తికి పంపే సందేశాలు కొంత సేపటి తర్వాత వాటంతటవే డిలీట్​ అయ్యేలా ఓ ఫీచర్​ను తీసుకువచ్చేందుకు వాట్సాప్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఒక వాట్సాప్ యూజర్​ మరో వాట్సాప్ యూజర్​కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్​ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. ఇలా ఈ ఫీచర్​ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్​ అవుతాయి. ప్రస్తుతం 'డిలీట్​ బోత్'​ అనే ఫీచర్​ ఇంచుమించు ఇలాంటి సదుపాయాలతో అందుబాటులో ఉంది.

ముఖ్యంగా యూజర్ మాన్యువల్​గా ఈ సదుపాయం వినియోగించాల్సి ఉంటుంది. ఇటీవలి కొత్త ఫీచర్లు ఇవే.. వాట్సాప్ ఇప్పటికే.. ఫింగర్​ప్రింట్​, ఫేస్​ అన్​లాక్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో పాటు అనవసర గ్రూపుల్లో.. గుర్తు తెలియని వారు మిమ్మల్ని చేర్చేందుకు వీలు లేకుండా సెక్యూరిటీ ఫీచర్​ను తెచ్చింది. దీని ద్వారా మీరు ఎంపిక చేసుకున్న వారు మాత్రమే మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చే వీలుండనుంది.

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లో ‘మన ఆరోగ్యం’ !!

Next Story