యాక్సిస్ బ్యాంక్‌తో ఏపీ పోలీసులు కుదుర్చుకున్న ఒప్పందం ఏంటీ?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2019 5:08 PM ISTగుంటూరు: పోలీస్‌శాఖ, యాక్సిస్ బ్యాంకు ఎంవోయు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి రామకృష్ణ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. పోలీసు సిబ్బందికి వ్యక్తిగత జీతాలపై యాక్సిస్ బ్యాంకు ఉత్తమ సేవలను అందించనుంది. ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా భద్రతను అందించేందుకు యాక్సిస్ బ్యాంక్ పోలీసు శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యక్తిగత ప్రమాద బీమా రూ.30 లక్షలు, ఉగ్రవాద దాడిలో చనిపోతే మరో రూ.10 లక్షలు మొత్తం కలిపి రూ.40 లక్షలకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించింనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా హోంగార్డులకు కూడా వర్తించనుంది. యాక్సిస్ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా మరో ఐదు రకాల ఇన్సూరెన్స్ పథకాలు పోలీసు సిబ్బందికి వర్తించనున్నాయి.
Next Story