కరోనా నుండి కోలుకొని వచ్చిన మహిళకు గ్రామస్తుల ఘనస్వాగతం

By Newsmeter.Network  Published on  15 May 2020 7:17 AM GMT
కరోనా నుండి కోలుకొని వచ్చిన మహిళకు గ్రామస్తుల ఘనస్వాగతం

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ వైరస్‌ అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 45లక్షల మందికిపైగా ఈ వైరస్‌ భారినపడ్డారు. వీరిలో 3లక్షల మంది మృతి చెందారు. భారత్‌లోనూ ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లోఈ వైరస్‌ సోకిన వారిని అంటరానివారిగా చూస్తున్నారు. వైరస్‌ సోకి ఆస్పత్రుల్లో చికిత్సపొంది కోలుకొని వచ్చినప్పటికీ వారి ని దూరం పెడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు గ్రామ ప్రజలు మాత్రం కరోనా వైరస్‌ సోకి ఇంటికి వచ్చిన మహిళకు ఘనస్వాగతం పలికారు. పొద్దుటూరు గ్రామానికి చెందిన పద్మ నీలోఫర్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తుంది.

Also Read :ఏపీలో 24 గంట‌ల్లో 57 కేసులు

తనవిధి నిర్వహణలో భాగంగా తనకు కూడా కరోనా వ్యాధి సోకింది. అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందింది. గత నాలుగు రోజుల క్రితం ఆమెకు పలు దఫాలుగా టెస్టులు నిర్వహించగా.. నెటిగివ్‌ వచ్చింది. దీంతో పద్మ తిరిగికి తన స్వగ్రామానికి చేరుకుంది. తన కూతురు ఆకాంక్షతో కలిసి గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు పూలుచల్లి ఘన స్వాగతం పలికారు. దీంతో గ్రామస్తులు చూపిన మర్యాదకు పద్మ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌ ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పద్మ స్టాఫ్‌ నర్సుగా విధులు నిర్వహిస్తూ.. కరోనా వైరస్‌ బాధితులకు ఎంతోమందికి చికిత్స అందించింది. ఆమె సేవలు అమోఘమని అన్నారు. అందుకే గ్రామస్తులమంతా కలిసి గ్రామంలోకి పద్మను ఘనంగా స్వాగతించామని తెలిపారు.

Also Read :ఏపీలో కిలో చికెన్‌ ధర రూ.310..!

Next Story