ఏపీలో కిలో చికెన్‌ ధర రూ.310..!

By Newsmeter.Network  Published on  15 May 2020 5:45 AM GMT
ఏపీలో కిలో చికెన్‌ ధర రూ.310..!

రెండునెలల క్రితం వరకు కిలో చికెన్‌ ధర ఎన్నడూ లేనంత తక్కువగా అంటే రూ. 30 పలికింది. పలు ప్రాంతాల్లో చికెన్‌ను ఉచితంగా కూడా పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి భారత్‌లో వ్యాపిస్తున్న తొలిరోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి పెరిగింది. దీంతో చికెన్‌ తింటే కూడా కరోనా వ్యాపిస్తుందనే వదంతులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో పౌల్ట్రి యాజమానులు కోళ్లను ఉచితంగా కూడా పంపిణీ చేశారు. చికెన్‌ తినడం వల్ల కరోనా వైరస్‌ సోకదని ప్రభుత్వాలు చెప్పడంతో మళ్లి చికెన్‌ ధరలు పెరగడం మొదలు పెట్టారు. నిన్నమొన్నటి వరకు ఏపీలో కిలో చికెన్‌ ధర రూ. 230వరకు విక్రయాలు జరిగాయి.

Also Read :బిగ్గరగా మాట్లాడటం ద్వారానూ వైరస్‌ వేగంగా వ్యాప్తి..!

కానీ ఊహించని రీతిలో ఇప్పుడు చికెన్‌ ధర రూ. 310కి చేరింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ధరలతో చికెన్‌ను విక్రయిస్తున్నారు. దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడా విక్రయించని విధంగా ఏపీలో పలు ప్రాంతాల్లో కిలో చికెన్‌ ధర రూ. 310 పలికి ఆల్‌టైం రికార్డ్‌ సృష్టించింది. గతంలో రూ. 260 కిలో చికెన్‌ ధర పలికింది. అప్పటి నుండి నేటి వరకు దేశంలో ఆల్‌టైం రికార్డు అదే. కానీ ప్రస్తుతం ఏపీలో రూ. 310 పలకడంతో ఇప్పడు ఇదే ఆల్‌టైం రికార్డుగా మారింది. దీనికి కారణం కరోనా ఎఫె క్టేనని పౌల్ట్రి యాజమానులు చెబుతున్నారు.

Also Read :ఫాం‌ హౌస్‌లో పేడ ఎత్తిన ఉపాసన.. ఆసక్తికర ట్వీట్‌..!

కరోనా ప్రభావం వల్ల పౌల్ట్రి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ప్రస్తుతం చికెన్‌ కొనుగోళ్లు పెరిగినప్పటికీ ఆ స్థాయిలో కోళ్ల లభ్యత లేనట్లు తెలుస్తోంది. దీంతో ఉన్న కోళ్లకు డిమాండ్‌ పెరగడంతో చికెన్‌ ధరలు అమాంతం కొండెక్కి కూర్చున్నట్లు పేర్కొంటున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ, తమిళనాడుల నుంచి దిగుమతి చేద్దామన్నా లాక్‌డౌన్‌ ఉండటంతో అది సాధ్యం కావటం లేదని పౌల్ట్రి యాజమానులు, చికెన్‌ దుకాణం దారులు పేర్కొంటున్నారు. మొత్తానికి కరోనా ఎఫెక్ట్‌ తో కిలో చికెన్‌ ధర రూ. 310 పెరగడంతో మాంసం ప్రియులు ముక్కన వేలుసుకొని.. శాఖాహారంతో భోజనం చేయడమే మేలని సర్దుకుపోతున్నారు.

Next Story