తెలంగాణకు భారీ వర్ష సూచన.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ మూడ్రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 9 July 2024 3:15 AM GMTతెలంగాణకు భారీ వర్ష సూచన.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ మూడ్రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వారా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. జూలై 13 నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. అలాగే మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
రెండ్రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు తేలికపాటి న ఉంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కాగా.. సోమవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు ప్రకటించారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పినపాకలో అత్యధికంగా 11.64 సెం.మీ నమోదు అయ్యింది. కరకగూడెంలో 7.22 సెం.మీ వర్షపాతం , కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 8.38 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.83 సెం.మీ, పెద్దపల్లి జిల్లా ముత్తారం-మంథనిలో 7.60 సెం.మీ, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 7.52 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో 7.29 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 6.98 సెం.మీ, జయశంకర్-భూపాలపల్లి జిల్లా రేగొండలో 6.48 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.