తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 29 Sep 2024 2:30 PM GMTతెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు సూచించింది.
ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అంతేకాదు.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతలు, ప్రజలు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. అలాగే ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.