తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 4:43 PM IST
తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా రాబోయే మూడ్రోజుల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని సూచించింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ నుజారీ చేశారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పారు.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాంహైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, , సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు పడుతాయని అన్నారు.
ఇక శనివారం సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, జనగాం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 7.7 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.