తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే: వాతావరణశాఖ

తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  3 Sept 2024 7:05 AM IST
తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే: వాతావరణశాఖ

తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించారు. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వాన లు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఐదు రోజుల్లో దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. సిబ్బంది కూడా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు చెప్పారు. ఆదిలాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మలాజిగిరి, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా టీజీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 1447 బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది. అలాగే, భారీ వర్షాలతో 432 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఏపీలోనూ వర్షాలు

ఏపీలో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేరొన్నది. ఇప్పటికే చాలా చోట్ల వరదలు ముంచేయడంతో సహాయక చర్యలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. మెడిసిన్, నుంచి ఆహారం, నీరు అన్నీ డ్రోన్ల ద్వారా అందిస్తోంది. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. విజయవాడలో స్వయంగా చంద్రబాబు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.

Next Story