హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
తెలంగాణలో రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
By Srikanth Gundamalla
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
తెలంగాణలో రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడతాయని అంచనా వేశారు. భాగ్యనగరంలో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ వెల్లడించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి సహా అన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్, బండ్లగూడ, సరూర్‌నగర్, ఉప్పల్, బాలానగర్, షేక్‌పేట ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షం దంచికొట్టింది. అత్యధికంగా హయత్‌నగర్‌లో 3.18 సెంటీమటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని పేర్కొన్నారు. బండ్లగూడ లో 1.95 సెం.మీ, సరూర్‌నగర్‌లో 1.83 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఒక్కసారిగా వర్షాలు పడటంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచపోయింది. దాంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఐటీ కారిడార్‌లోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్నుంచి కేపీహెచ్ బీ వైపు, ఖాజగూడ సిగ్నల్నుంచి షేక్‌పేట ఫ్లైఓవర్ వైపు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. మరోవైపు శుక్రవారం 6.4 సెం.మీ. నుంచి 11.5 సెం.మీ. కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.