ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Meteorological center says there is a chance of rain in AP for three days. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తుకు

By అంజి
Published on : 25 Aug 2022 4:04 PM IST

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తుకు విస్తరించి నైరుతి దిశగా వంగడం వల్ల రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడులోని ఉత్తర మధ్య అంతర్భాగం మరియు పరిసర ప్రాంతాలలో మరో ఉపరితల ద్రోణి ఏర్పడి సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా అనంతపురం జిల్లా బీకే సముద్రం మండలం రేకులకుంటలో 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో వైపు తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు, పలు ప్రాంతాల్లో రాబోయే మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story