తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 4, 2025
కాగా నిన్న రాత్రి హైదరాబాద్‌లోని మణికొండ, బాచుపల్లి, నల్లగండ్ల, అల్వాల్, కొంపల్లి తదితర ప్ఆరంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు నేడు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు,తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. #WeatherUpdate pic.twitter.com/RjKyPSC3yx
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 4, 2025