తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే..
By అంజి
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇది వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ & ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని. ఆ తర్వాత ఇది వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ & ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 29, 2025
తెలంగాణ రాష్ట్రంలో నేడు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :29-08-2025 pic.twitter.com/zcfb9RbUG0
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 29, 2025
Dr. (Smt) K Nagaratna Madam, Head Meteorological Centre Hyderabad, briefing about the prevailing weather conditions and weather warnings issued over Telangana on 29 Aug 2025.(telugu and english) pic.twitter.com/eVci9kSPmb
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 29, 2025