బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

అండమాన్ సముద్రం మీదుగా సోమవారం ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారిందని, అక్టోబర్ 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

By అంజి  Published on  21 Oct 2024 10:42 AM IST
Low pressure, Bay of Bengal, Rain forecast

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

అండమాన్ సముద్రం మీదుగా సోమవారం ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారిందని, అక్టోబర్ 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఎగువ వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనంగా ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రత్యేక సందేశంలో తెలిపింది.

"ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22 ఉదయం నాటికి తీవ్ర అల్పపీడనంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది" అని ఐఎండీ తెలిపింది. ఈ తుపాను అక్టోబరు 24 ఉదయం నాటికి వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల నుంచి వాయువ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ వద్ద ఏర్పడ్డ ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Next Story