తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. రెండు రోజులు వర్షాలు
IMD Predicts Moderate Rainfall in Telugu States For Next 2 Days.ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నా సమయంలో
By తోట వంశీ కుమార్ Published on 15 April 2022 6:29 AM GMTఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నా సమయంలో ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు ఇది. ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడి వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. రానున్న ఐదు రోజులు తెలంగాణలో వాతావరణం ఇలా ఉండనుంది. ఈ నెల 18 వరకూ తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి పసుపు రంగు అలర్ట్ ను కూడా వాతావరణ కేంద్రం జారీ చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 14, 2022
ఏప్రిల్ 15న ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మిగతా జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. కాగా.. ఎండవేడిమి, ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలకు వర్ష సూచన చల్లని కబురు అని చెప్పాలి.