అలర్ట్.. ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చాలా చోట్ల వరదలు సంభవించి భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడే కోలుకుంటుంది. అయితే.. వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరోసారి అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నది. పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతోందని తెలిపింది. దీని కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఈ వాయుగుండం కారణంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లా, పార్వీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఇక కొన్ని చోట్ల తేలికపాటు వర్షాలు పడతాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఈ మేరకు సముద్రంలో ఎవరూ చేపల వేటకు వెళ్లొదన్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు ఈదురుగాలలు వీచే కారణంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇక ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.