బంగాళాఖాతంలో అల్పపీడనం...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 10:17 AM GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం...!

అమరావతి: ఈనెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 23 నుంచి 26 వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు చెప్పారు. అంతేకాకుండా.. కృష్ణా, గోదావరి నదులకు మళ్లీ భారీ వరద వచ్చే సూచనలున్నాయని హెచ్చరించారు. ఈ నెల19న అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఫలితంగా గుజరాత్ , మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వచ్చే అవకాశముందని ఆర్టీజీఎస్‌ అధికారులు హెచ్చరించారు.

ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద వచ్చే అశకాశముంది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 4 వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చే అవకాశముందని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి తీర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు

Next Story