ఇలాంటి అవినీతి సీఎంను మరెక్కడా చూడలేదు- చంద్రబాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 11:46 AM GMT
ఇలాంటి అవినీతి సీఎంను మరెక్కడా చూడలేదు- చంద్రబాబు

శ్రీకాకుళం: నేతలు పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నా రాజకీయ చరిత్రలో 10 ముఖ్యమంత్రులను చూశాను కానీ ఇలాంటి అవినీతి సీఎంను మరెక్కడా చూడలేదన్నారు. నేనే తెలుగుదేశం పార్టీ అనుకుంటే మీ పార్టీ రాష్ట్రంలో ఉండేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడెల మీద వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టిందని ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌కి పెళ్లికి పోతే ఖర్చు లేదు కానీ.. కోర్టుకు పోతే ఖర్చు అవుతుందని అందుకే సీఎం జగన్‌ కోర్టుకు వెళ్లడం లేదని విమర్శించారు. జగన్‌ చిల్లర రాజకీయాలు టీడీపీ దగ్గర పని చేయవని చంద్రబాబు అన్నారు.

Next Story
Share it