కరోనాకంటే మేం తెలివైన వాళ్లం - ట్రంప్
By Newsmeter.Network Published on 7 April 2020 10:21 AM GMT
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ భారిన పడి లక్షలాది మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ వైరస్ అగ్రరాజ్యం అమెరికాపై పంజా విసురుతోంది. దీంతో అమెరికాలో ఈ వైరస్ భారిన పడిన వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. మృత్యువాత పడినవారిలోనూ ఈ దేశంలో ఎక్కువే. ఇప్పటికే అమెరికాలో 3,67,650 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10,943 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ట్రంప్ సర్కార్ పకడ్బందీ చర్యలు చేపడుతున్నా.. వైరస్ కట్టడి కావటం లేదు.
Also Read :హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్ కంటికి కనిపించని ఓ భయంకరమైన శత్రువు అని అన్నారు. కరోనా శక్తిమంతమైంది, తెలివైంది కావచ్చు అని, కానీ మేం అంతకన్నా తెలివైన వాళ్లం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై తాము ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నామని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను, ఇతర సిబ్బంది నిత్యం కరోనా పరీక్ష చేయించుకుంటూనే ఉంటామని తెలిపారు. ప్రస్తుతం కరోనా పరీక్షకు పెద్దగా సమయం కూడా పట్టడం లేదని, సులభంగా అయిపోతోందని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ట్రంప్ రెండు సార్లు కరోనా పరీక్ష నిర్వహించుకున్నారు. రెండు సార్లు పాజిటివ్ అని వచ్చింది.