వార్నర్‌కి మైండ్ బ్లాక్.. 15 సెకన్ల వీడియో కోసం 51 సార్లు..
By తోట వంశీ కుమార్ Published on 30 May 2020 1:09 PM ISTఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా చెప్పినట్లుగానే మహేష్ అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. కరోనాతో ఇంటికే పరిమితం అయిన ఈ ఆసీస్ క్రికెటర్ టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. అతడి సతీమణి క్యాండిస్‌తో కలిసి అదరగొడుతున్నాడు.
ఇప్పటికే అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు స్టెప్పులేసిన వార్నర్ పోకిరి, బాహుబలి సినిమా డైలాగ్స్‌తో మెప్పించాడు. వార్నర్ జోష్ చూస్తున్న అభిమానులు స్పెషల్ రిక్వెస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక మేరకు 'పక్కా లోకల్' సాంగ్‌తో బర్త్‌డే విషెస్ చెప్పి వారిని ఆనందంలో ముంచెత్తాడు.
ఇక మహేష్ అభిమానులు కోరిక మేరకు సరిలేరు నీకెవ్వరులోని 'మైండ్ బ్లాక్' పాటకి సంబంధించిన స్టెప్పులతో పార్ట్-1ని విడుదల చేశాడు. ఈ స్టెప్పుల కోసం కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు వార్నర్. ఈ పాట వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో కోసం 51 సార్లు ప్రయత్నం చేశానని రాసుకొచ్చాడు వార్నర్. ఈ పాటకు సంబంధించిన రెండో పార్ట్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వార్నర్ చేసిన మైండ్ బ్లాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహేష్ పాటకి నిజంగా వార్నర్ మైండ్ బ్లాక్ అయ్యిందంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.