స్విమ్‌సూట్‌లో డేవిడ్ వార్నర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
By తోట వంశీ కుమార్ Published on 27 April 2020 6:00 PM ISTకరోనా వైరస్ దెబ్బతో క్రీడలన్ని నిలిచిపోయాయి. దీంతో ఆటగాళ్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనకు లభించిన ఈ విరామాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే కూమారై కోరిక మేరకు టిక్‌టాక్‌లో అరగ్రేటం చేసిన ఈ ఆస్ట్రేలియగా ఆటగాడు వరుస వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల కుమారైతో బాలీవుడ్ హిట్ సాంగ్ 'షీలాకి జవానీ' పాటకు డ్యాన్స్‌చేసి అలరించిన వార్నర్ తాజాగా తన భార్య క్యాండితో కలసి ఓ వీడియో చేశాడు.
ఆ వీడియోలో ఏంముందంటే.. వార్నర్ ఆసీస్ జెర్సీ ధరించి బ్యాట్ పట్టుకుని ఉండగా.. అతని భార్య క్యాండీస్ స్విమ్ సూట్‌లో తెడ్డు పట్టుకుని బోటును నడిపింది. ఓ లైట్ మ్యూజిక్‌తో వీడియో సాగుతుంది. అయితే అకస్మాత్తుగా ఆ వీడియో ఇద్దరి ప్లేస్ మారుతుంది. వార్నర్ డ్రెస్సులో క్యాండిస్.. భార్య సర్ఫింగ్ కాస్ట్యూమ్‌లోకి డేవిడ్ మారుతాడు. ఇక ఆ వీడియో చూసి నవ్వడమే మన వంతు. ఈ వీడియోను వార్నర్ తన ఇన్‌స్టా గ్రామ్ ఎకౌంట్ లో పోస్టు చేశాడు. ఇంకేముంది స్విమ్ సూట్ లో వార్నర్ కనిపించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.