ఐపీఎల్‌లో వార్నర్‌ ఒకే ఒక్కడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 10:21 AM GMT
ఐపీఎల్‌లో వార్నర్‌ ఒకే ఒక్కడు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో 13వ సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. గురువారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 50 సార్లు 50పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వార్నర్‌ 40బంతుల్లో 5పోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 52 పరుగులు చేశాడు.

దీంతో ఐపీఎల్‌లో వార్నర్‌ అర్థశతకాలను ఇప్పటి వరకు 50 సార్లు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. వార్నర్‌ ఈ ఘనతను 132 ఇన్నింగ్స్‌లో సాధించాడు. వార్నర్‌ తరువాతి స్థానంలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ(42), ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా (39), ఏబీ డివిలియర్స్‌ (38) తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7పోర్లుచ 1సిక్సర్‌) తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం చేధనలో పంజాబ్‌ 132 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్లలో నికోలస్‌ పూరన్‌( 77 ; 37బంతు్లో 5 పోర్లు, 7 సిక్సర్లు) ఒక్కడే ధాటిగా బ్యాటింగ్‌ చేసినా.. అతడికి సహకరించే వారే కరువయ్యారు. ఏ దశలోనూ పంజాబ్‌.. చేజింగ్‌ చేసేలా కనిపించలేదు.

2009 నుంచి ఐపీఎల్ ఆడుతున్న వార్నర్ ఇప్పటి వరకు 132 మ్యాచుల్లో 4,933 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. అయితే.. 2018లో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు ఆటకు దూరం కాగా.. ఆ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ ఆడలేదు. గతేడాది నిషేదం పూర్తిచేసి వచ్చి రాగానే 12 మ్యాచుల్లో 692 పరుగులు చేసి తానెంతటి విలువైన ఆటగాడినో చెప్పకనే చెప్పాడు.

Next Story