వరంగల్ లో సందడి చేయనున్న 'జీ తెలుగు' స్టార్స్
Zee Telugu Stars to Visit Warangal On 18th June. ప్రేక్షకులు తాము ఎంతగానో ఆదరించే 'జీ తెలుగు' స్టార్స్ ను ప్రత్యక్షంగా చూసే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jun 2022 11:15 AM GMT
ప్రేక్షకులు తాము ఎంతగానో ఆదరించే 'జీ తెలుగు' స్టార్స్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తూ, ఛానల్ 'జీ తెలుగు సపరివార సకుటుంబ సమేతంగా' అనే కార్యక్రమంతో వరంగల్ ప్రజల ముందుకు రానుంది. 'అదిరింది' ఫేమ్ సద్దాం, యువనటి భానుశ్రీ ఈ ఈవెంట్ కి హోస్ట్స్ గా వ్యవహరిస్తుండగా, 'దేవతలారా దీవించండిస, 'కృష్ణ తులసి' సీరియల్స్ కి చెందిన నటీనటులు, సరిగమప' గాయనీగాయకులు, సింగర్ మధుప్రియ తదితరులు వేదికపై సందడి చేయనున్నారు. వరంగల్ లోని వేణుగోపాలస్వామి గుడి ఎదురుగా ఉన్న కొత్తవాడ గ్రౌండ్ (తోట మైదాన్) లో శనివారం (జూన్ 18) సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా.. ఛానెల్ వరంగల్ వాసులకు ఒక సెల్ఫీ కాంటెస్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా, 'జీ తెలుగు' చూస్తూ సెల్ఫీతీసి 7032904615 నెం.కి వాట్సాప్ చేస్తే.. అద్భుతమైన బహుమతులతో సహా 'జీ తెలుగు' తారలు నేరుగా మీఇంటికే వచ్చే అవకాశాన్ని పొందవచ్చు. 'జీ' తారలు శనివారం సెల్ఫీ కాంటెస్ట్ విజేతల ఇళ్లను సందర్శించి అక్కడ అభిమానులతో ముచ్చటించి సాయంత్రం ఐదున్నర గంటలకు ఎంజీ రోడ్ చేరుకొని అక్కడనుండి వేదిక వరకు ఊరేగింపుగా బయలుదేరుతారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు మొదలవనున్న ఈ కార్యక్రమం, హాస్యపూరితమైన ఆటపాటలతో, ఉర్రూతలాడించే డాన్స్ ప్రదర్శనలతో, కితకితలాడించే కామెడీ స్కిట్స్ తో అభిమానులకు మంచి వినోదాన్ని పంచనుంది.