సీఆర్‌పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు.. ఒకరి మృతి
Shooting between CRPF Jawans in Mulugu District.ములుగు జిల్లాలో సీఆర్‌ఫీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 26 Dec 2021 5:10 AM GMT
ములుగు జిల్లాలో సీఆర్‌ఫీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెంకటాపురం మండల కేంద్రంలోని 39వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం సీఆర్ఫీఎఫ్ 39వ బెటాలియన్‌కు చెందిన ఎస్సై ఉమేశ్ చంద్ర, మెస్ ఇన్‌చార్జి అయిన కానిస్టేబుల్ స్టీఫెన్ మధ్య భోజనం తయారీ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంలో ఇద్దరు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. బీహర్‌కు చెందిన ఉమేశ్ చంద్ర అక్కడిక్కడే మరణించగా.. తమిళనాడు చెందిన స్టీఫెన్ కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, తల భాగంలో బుల్లెట్ గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కాగా.. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.