వరంగల్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు రైలు ప్రయాణికులు గాయపడ్డారు. 1వ నంబరు ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికులు రైలు వచ్చే వరకు వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంక్‌లోంచి పొంగుతున్న నీరు షెడ్డుపై బలంగా తాకడంతో వారు నిల్చున్న షెడ్డు వారిపై పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాగా తెల్లవారుజామున కావడంతో ఫ్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం, పగటిపూట అయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని సిబ్బంది అంటున్నారు. 2016లో కూడ ఇదే తరహాలో వరంగల్ రైల్వే స్టేషన్‌లో వాటర్ ట్యాంక్ కూలింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిపోవడంతో ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారంపై నీళ్లు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.