వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి
Permission for YS Sharmila's Padayatra. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు.
By M.S.R Published on 27 Jan 2023 1:15 PM GMTవైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే కండీషన్లతో కూడిన అనుమతులను మాత్రమే ఇచ్చారు. చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గత ఏడాది నవంబర్ 28న షర్మిల అరెస్ట్‌తో పాదయాత్ర నిలిచింది. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.
ఈనెల 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవాడనికి సీపీకి వైఎస్ఆర్టీపీ నేతలు దరాఖాస్తు చేశారు. అయితే వచ్చే నెల 2 నుంచి 18 వరకూ పాదయాత్ర నిర్వహించుకోవడానికి సీపీ రంగనాథ్ అనుమంతించారు. ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతినిచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పద వాఖ్యలు చేయవద్దని కండీషన్లు పెట్టారు. ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతినిచ్చారు. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. 4,000 కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.