కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా.. మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

హ‌నుమ‌కొండ నుంచి హైద‌రాబాద్ వెలుతుండ‌గా.. జ‌న‌గామ జిల్లా ఇందిర‌మ్మ కాల‌నీ వ‌ద్ద మాధ‌వ‌రెడ్డి కారు బోల్తాప‌డింది. ఆయన కారు బైక్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న కాలవలోకి దూసుకు వెళ్ళింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కానీ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‎ ఆస్పత్రికి తరలించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story