నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
Minister KTR Warangal Tour Today.ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు(బుధవారం) ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
By తోట వంశీ కుమార్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు(బుధవారం) ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో రూ.236 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఓరుగల్లు మొత్తం గులాబీమయంగా మారిపోయింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్..
- ఉదయం 9.15 గంటలకు వరంగల్ ఆర్ట్, సైన్స్ ప్రాంగణానికి చేరుకోనున్న మంత్రి కేటీఆర్
- వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
- 10.10 గంటలకు స్మార్ట్ రోడ్డు ఆర్ -4 , రీజినల్ గ్రంథాలయం ప్రారంభోత్సవం
- అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో చేపట్టిన వివిధ పనుల ప్రారంభం
- ఉదయం 11.30 గంటలకు హెలీకాప్టర్‌లో నర్సంపేటకు
- మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు చేరుకోనున్న కేటీఆర్
- నర్సంపేట మునిసిపాలిటీ కార్యాలయంలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
- అశోక్ నగర్‌లో పైపుల ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభం అనంతరం బైపాస్ రోడ్డులో బహిరంగ సమావేశం
- మధ్యాహ్నం 1.30 గంటలకు నర్సంపేట నుంచి ఆర్ట్స్ కళాశాలకు చేరుకోనున్నారు
- మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు హన్మకొండ కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతిపై రివ్యూ
- సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో సభ
- సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరనున్న మంత్రి కేటీఆర్.