Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోని.. ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.

By అంజి  Published on  16 Aug 2023 8:39 AM IST
Four killed, road accident, Warangal district

Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోని.. ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది. బాధితులు తేనె విక్రయించే కూలీలని సమాచారం. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో నడపడమే ప్రమాదానికి కారణం అయివుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.అయితే మృతుల వివరాల, వారి స్వస్థలం తెలియాల్సి ఉంది.

Next Story