ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
AP Express technical issue stops near Nekkonda Railway Station.విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్
By తోట వంశీ కుమార్ Published on
21 Jan 2022 3:37 AM GMT

విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున ఎస్ 6 బోగీ వద్ద ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేశారు. భయంతో ప్రయాణీకులు రైలు దిగి పరుగులు తీశారు. బ్రేక్ ప్యాడ్స్ జామ్ కావడంతోనే పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేగకుండా పొగలను అదుపులోకి తెచ్చారు. స్టేషన్‌లో రెండు లైన్లో రైళ్లు ఆగడంతో అరగంట సేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగలను అదుపుచేసిన అనంతరం రైలు ఢిల్లీ బయలుదేరింది.
Next Story