వరంగల్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
By సుభాష్ Published on 2 Sept 2020 7:26 AM ISTవరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పసరగొండ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇసుకతో వెళ్తున్న ఓ లారీ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారు ఓవర్ టెక్ చేస్తూ లారీ డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను అతి కష్టం మీద కారు నుంచి వెలితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు వరంగల్ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన మేకల రాకేష్, పవన్, రోహిత్, చందు, సాబీర్‌గా గుర్తించారు.వీరంతా కారు వరంగల్ నుంచి పరకాలకు వెళ్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story