వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ( వీడియోతో)
By సుభాష్Published on : 18 April 2020 5:42 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ దంపతులను ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు నాయిని ఐలయ్య (67), వెంకటమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం రాంపూర్ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కాగా, వారిని ఢీకొట్టిన వాహనం ఎవరిది అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘనట స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-18-at-5.29.20-PM.mp4"][/video]
Next Story