వనపర్తి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట 44వ జాతీయ రహదారిపై వేగంగా వెళ్లిన తుఫాన్‌ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తుఫాన్‌ వాహనంలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు.

హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ఘరో ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విశ్లేషిస్తున్నారు. కాగా క్షతగాత్రులను వనపర్తి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్‌ పట్టణ శివారులో ఆగివున్న ట్రాక్టర్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు మత్తడిగూడకు చెందిన భీంరావుగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్తించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.