మీరు వెళ్లలేని ప్రదేశాల్లో నేను ఫొటోలు తీస్తా..!

By రాణి  Published on  28 Jan 2020 5:24 AM GMT
మీరు వెళ్లలేని ప్రదేశాల్లో నేను ఫొటోలు తీస్తా..!

పేరుకే శునకాలు గానీ...నిజానికి వాటికున్న విశ్వాసం, తెలివితేటలతో పోలిస్తే...మానవ మాత్రులకు అవి రెండూ తక్కువనే చెప్పాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ జాగిలం ఇప్పుడు వాల్తేరు ఆర్పీఎఫ్ కు సేవలందిస్తోంది. వీపుపై గోప్రో కెమెరా తగిలించుకుని మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లోకి వెళ్లి ఫొటోలను తీస్తుంది. అది తీసే ఫొటోలు, వీడియోలను భద్రతా సిబ్బంది వైఫై ద్వారా చూడవచ్చు. ఈ కెమెరా 170 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఫొటోలను తీస్తుందని, అలాగే 4కే అల్ర్టా హెచ్ డీ వీడియో కూడా రికార్డ్ అవుతుందని వాల్తేరు డివిజనల్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ వెల్లడించారు.

Next Story