ఆ బూతు సినిమాకి స‌బ్ టైటిల్స్ కావాల‌ట‌..

By Newsmeter.Network  Published on  18 Jan 2020 11:50 AM GMT
ఆ బూతు సినిమాకి స‌బ్ టైటిల్స్ కావాల‌ట‌..

ఒక భాష‌లోని సినిమా వేరే బాష‌లో విడుద‌లైతే కింద‌ స‌బ్ టైటిల్స్ వేయ‌డం చూస్తుంటాం. స‌బ్ టైటిల్ వేయ‌డం వ‌ల్ల చూసే వారికి ఆ సినిమా బాగా అర్థం అవుతుంది. కాగా న్యూయార్స్ లోని ఓ వ్య‌క్తి మాత్రం ఈ స‌బ్‌టైటిల్స్ కోసం కోర్టుకు ఎక్కాడు. అయితే అది మాములు సినిమాల కోసం కాదండోయ్.. పోర్న్ మూవీల కోస‌మ‌ట‌.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఓ దివ్యాంగుడు అమెరికాలోని న్యూయార్క్‌లోని బ్రూక్‌లిన్‌ ఫెడరల్‌ కోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలు చేశాడు. న్యూయార్క్‌కు చెందిన యారోస్లావ్‌ సూరిస్‌ పుట్టకతోనే చెవిటివాడు. తాము చెవిటివాళ్లం కావడం వల్ల అశ్లీల వీడియోలకు క్యాప్షన్‌ లేకపోవడంతో సాధారణ వ్యక్తుల మాదిరిగా వీడియోను ఎంజాయ్‌ చేయలేకపోతున్నామని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాదు ఫోర్న్‌ వీడియోలు ప్రసారం చేసే ఫోర్న్‌హబ్‌, రెడ్‌ట్యూబ్‌, యూపోర్న్‌ వెబ్‌సైట్లతో పాటు కెనెడియన్‌ పేరెంటింగ్‌ కంపెనీ మైండ్‌గ్రీక్ ల‌పై కేసు పెట్టాడు. అమెరికన్‌ వికలాంగుల చట్టాన్ని ఈ వెబ్‌సైట్లు ఉల్లఘించి తమపై వివక్షత చూపుతున్నాయని పేర్కొన్నాడు.

‘‘ఫోర్న్‌ వీడియోలకు క్యాప్షన్‌ లేకపోతే చెవిటివారు వీడియోను ఎలా ఎంజాయ్ చేయగలరు. సాధారణ వ్యక్తుల మాదిరిగా మేము వీడియోను చూడలేం’’ అంటూ 23 పేజీల పిటిషన్‌లో సూరిస్‌ తెలిపాడు. దీనిపై పోర్న్‌హబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోరీ ప్రైస్‌ స్పందిస్తూ తమ వైబ్‌సైట్‌లో క్లోజ్‌డ్‌ క్యాప్షన్‌ ఆప్షన్‌ ఉందని, దాన్ని ఎంచుకోవాలంటే అందులో ఉన్న లింక్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుందని చెప్పడం ఇందులో కొసమెరుపు.

Next Story