‘యాక్షన్’ మూవీ రివ్యూ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 5:14 PM ISTహీరో విశాల్, తమన్నా హీరో,హీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’. ఈ భారీ చిత్రాన్ని శ్రీ కార్తికేయ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ ఆడెపు తెలుగు ప్రేక్షకులకు అందించారు. నవంబర్ 15న అనగా ఈ రోజు యాక్షన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే విశాల్ కి ‘యాక్షన్’ ఎలాంటి ఫలితాన్ని అందించింది..? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాల్సిందే.
కథ - సుభాష్(విశాల్) ఓ మిలటరీ కమాండర్. సుభాష్ తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సుభాష్ అన్నయ్య(రామ్‌కీ) ఉప ముఖ్యమంత్రి. రామ్ కీని ముఖ్యమంత్రి చేయాలనేది తండ్రి ఆలోచన. ఈసారి ఎన్నికల్లో పెద్ద కొడుకుని ముఖ్యమంత్రిని చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటారు. జాతీయ పార్టీతో కలిసి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారు.
అయితే... సుభాష్ అన్నయ్యకి దీపక్ మంచి ఫ్రెండ్. వ్యాపారంలో నష్టం వస్తే.. గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఒకటి దీపక్ కి వచ్చేలా చేస్తాడు. సుభాష్ తన మరదలు మీరా (ఐశ్వర్య లక్ష్మి)ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అయితే... తోటి ఆఫీసర్ తమన్నా సుభాష్ ని ప్రేమిస్తుంటుంది. అయితే.. ఊహించిన విధంగా ట్రెరరిస్ట్ నాయకుడు సయ్యద్ ఇబ్రహీం మాలిక్ (కబీర్ దుహన్ సింగ్) ఒక ప్లాన్ ప్రకారం బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఈ బాంబ్ బ్లాస్ట్ వలన జాతీయ నాయకుడు చనిపోతాడు. ఇదంతా సుభాష్ అన్నయ్య ప్లాన్ అని అందరూ నమ్మేలా చేస్తాడు.
అవమానంతో సుభాష్ అన్నయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. సయ్యాద్ ఇబ్రహీం మాలిక్ వెనక ఎవరున్నారు..? సుభాష్ అన్నయ్య మరణం వెనక ఉన్న సీక్రెట్ ఏంటి..? పాకిస్థాన్ లో ఉన్న మాలిక్ ని సుభాష్ ఎలా పట్టుకున్నాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
విశాల్ నటన
యాక్షన్ సీన్స్
సుందర్ సి డైరెక్షన్
డుడ్లీ సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథ
అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించడం
విశ్లేషణ - మిలటరీ కమాండర్ సుభాష్ పాత్రను విశాల్ చాలా ఇష్టపడి చేసారు. ఆ ఇష్టం తెర పై కనిపిస్తుంది. థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడు ఈ సినిమా చూసి థ్రిల్ ఫీలయ్యాలా యాక్షన్ స్టంట్స్ లో అద్భుతంగా నటించాడు. ఇంకా చెప్పాలంటే... ఇది హాలీవుడ్ మూవీనా అనే ఫీలింగ్ కలిగించింది. తెర పై విశాల్ ఇష్టం కనపడితే.. తెర వెనక డైరెక్టర్ సుందర్ సి ఇష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే... సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు
మనం చూస్తుంది సినిమా అని తెలిసి కూడా... హీరో టెన్షన్ పడితే... ప్రేక్షకుడు కూడా టెన్షన్ పడేలా సినిమా ఉందంటే.. సక్సెస్ సాధించినట్టే అని చెప్పచ్చు. ఈ సినిమా ఫస్టాఫ్ బిగినింగ్ లో ఏంటిది ఇలా ఉంది అనిపించినా... ఆతర్వాత సీన్స్ ప్రేక్షకులను సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా తెరకెక్కించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
రేటింగ్ - 2.5/5