బిగ్‌ బ్రేకింగ్‌: విశాఖ ఫార్మాసిటీలో మరో భారీ ప్రమాదం

By సుభాష్  Published on  13 July 2020 11:40 PM IST
బిగ్‌ బ్రేకింగ్‌: విశాఖ ఫార్మాసిటీలో మరో భారీ ప్రమాదం

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాల్వెంట్‌ ప్లాంట్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైరింజన్లు సైతం దూరంగా నిలిపివేసి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు దాటికి ఫైరింజన్లు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా, మంటల్లో పలువురు చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఇప్పటి వరకూ 17 సార్లు పేడుళ్లు జరిగి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భారీ శబ్దాలతో ప్రమాదం చోటు చేసుకోవడంతో చుట్టు పక్కల ప్రజలు తీవ్ర భయాందోళన గురయ్యారు. పోలీసులు, అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Next Story